ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో నిత్యవసరాల పంపిణీ - పశ్చిమగోదావరి జిల్లాలో కూరగాయల పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లాలో లాక్​డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేద కుటుంబాలకు.. తెదేపా నాయకులు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

tdp leaders distributing essential things to poor people in west godavari
పేదలకు తెదేపా నాయకుల నిత్యవసరాల పంపిణీ

By

Published : May 2, 2020, 8:44 PM IST

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురం, శివపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పేద కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రోత్సాహంతో నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో సుమారు 13 వందల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా విపత్తు సమయంలో పేదవారికి తమ వంతు సాయంగా అందజేసినట్లు పార్టీ మండల నాయకుడు అల్తి సత్యనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details