పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు శ్రమిస్తోన్న ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందికి తెదేపా నేతలు, కార్యకర్తలు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందికి పూర్తిస్థాయిలో వీటిని అందిస్తామని చెప్పారు. దీనిపై ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సిబ్బందికి ఉచితంగా శానిటైజర్లు, మాస్కుల పంపిణీ - tdp distributed free msaks to government staff in west godavari
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారు. వారికి సహాయం అందించేందుకు ప్రజా ప్రతినిధులు, దాతలు ముందుకు వస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరంలో తెదేపా నేతలు.. ప్రభుత్వ సిబ్బందికి ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
ప్రభుత్వ సిబ్బందికి ఉచితంగా శానిటైజర్లు, మాస్కుల పంపిణీ