ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతించిన తెదేపా నేతలు - స్థానిక సంస్థల ఎన్నికలపై మాజీ మంత్రి చినరాజప్ప వ్యాఖ్యలు

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

chinarajappa comments on local body elections
స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతించిన తెదేపా నేతలు

By

Published : Jan 21, 2021, 11:47 PM IST

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల మాజీ మంత్రులు చినరాజప్ప, పీతల సుజాత, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మాజీమంత్రి పితాని సత్యనారాయణ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన నేతలు... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెదేపా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు నేతలు సూచించారు. కోర్టు ఆదేశాలకు లెక్కపెట్టకుండా స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన్​, వైకాపా మంత్రులు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా తప్పుబట్టారు.

ABOUT THE AUTHOR

...view details