పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో గోదావరి వరద బారినపడిన లంక గ్రామాలలో తెదేపా నేత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పర్యటించారు. అయోధ్య లంకలో పర్యటించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు. వరద వల్ల నిరాశ్రయులైన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆహారం, తాగునీరు, నిత్యావసర సరుకులను ప్రజలకు అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
వరద ముంపు గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ - పశ్చిమగోదావరి ముంపు గ్రామాల్లో పితాని
పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపుకు గురైన గ్రామాలను తెదేపా నేత పితాని సత్యనారాయణ పర్యటించారు. వరద వల్ల నిరాశ్రయులైన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వరద ముంపు గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ