తమిళనాడులో పట్టుపడిన కోట్లాది రూపాయల నగదుకు రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి సంబంధం ఉందని తెదేపా నేత గన్ని వీరాంజనేయులు ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల అక్రమ సొమ్ముతో సంబంధం ఉన్న మంత్రిని తక్షణమే పదవి నుంచి తొలగించి... ప్రభుత్వం నిజాయతీ నిరూపించుకోవాలని హితవు పలికారు. డబ్బుతో పట్టుబడిన వ్యక్తులు మంత్రి పేరు చెప్పినా.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
'మంత్రి పేరు చెప్పినా.. చర్యలు ఎందుకు తీసుకోలేదు?' - మంత్రి బాలినేనిపై తెదేపా ధ్వజం
అక్రమ నగదుతో పట్టుపడిన వ్యక్తులు మంత్రి పేరు చెప్పినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని.. తెదేపా నేత గన్ని వీరాంజనేయులు ప్రశ్నించారు. మంత్రి బాలినేనిని పదవి నుంచి తప్పించి ప్రభుత్వం నిజాయతీ నిరూపించుకోవాలని హితవు పలికారు.

మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు