ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ పంచాయతీ ఎన్నికల్లో మేజర్ పంచాయతీలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా పురపాలక ఎన్నికల తెదేపా పరిశీలకుడు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. ఏలూరులోని మున్సిపల్, కార్పొరేషన్లో పోటీ చేసే అభ్యర్థులతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
జిల్లాలో జరుగనున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. మార్చి 10న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక స్థానాలు కైవసం చేసుకుని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన మేనిఫెస్టోను నాయకులు విడుదల చేశారు.