ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంటనష్ట పరిహారం ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి' - గన్ని వీరాంజనేయులుపై వార్తలు

వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని తెదేపా నేత గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడుగా గన్ని వీరాంజనేయులు బాధ్యతలు చేపట్టారు.

ganni veeranjaneyulu
గన్ని వీరాంజనేయులు

By

Published : Oct 19, 2020, 6:53 PM IST

రెండునెలలుగా భారీ వర్షాలు, వరదలతో రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీసం క్షేత్రస్థాయి పర్యటన చేయలేదని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు తెదేపా కార్యాలయంలో ఆయన ఏలూరు తెదేపా పార్లమెంటు బాధ్యులుగా పదవీబాధ్యలు చేపట్టారు. జిల్లా నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గన్ని వీరాంజనేయులును పలువురు నాయకులు అభినందించారు.

పంటనష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 25వేలు పంటనష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details