పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరణించారంటూ కొందరు వ్యక్తులు(social media) సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన చింతమనేని ప్రభాకర్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు, అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫేస్ బుక్లో నకిలీ ఖాతా సృష్టించి.. సంవత్సర కాలంగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చింతమనేని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్య పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
fake account: 'తప్పుడు పోస్టులు పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' - west godavari latest updates
సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేస్తున్న చింతమనేని