చంద్రబాబు నాయుడు కుటుంబంపై.. వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా(TDP Leaders protest over YSRCP comments on chandrababu).. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెదేపా నేతలు, కార్యకర్తలు రహదారులపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో వైకాపా దిష్టిబొమ్మ దహనం చేశారు. దీంతో.. పోలీసులకు, తెదేపా నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది.
ఈ క్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌ను పోలీసులు కొట్టుకుంటూ.. బలవంతంగా లాక్కెళ్లి ఆటో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. రాత్రంతా కస్టడీలో ఉన్న శ్రీనివాస్ ను.. ఉదయం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.