ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చింతమనేనికి రిమాండ్.. ఏలూరు సబ్ జైలుకు తరలింపు - చింతమనేని తాజా వార్తలు

తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేసిన పోలీసులు... ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా.. ఏలూరు సబ్ జైలుకు తరలించారు.

tdp-leader-chintamaneni-arrest

By

Published : Sep 11, 2019, 5:32 PM IST

పోలీసులు అరెస్ట్ చేయలేదు.. నేనే వచ్చా: చింతమనేని

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టు వ్యవహారం.. హై డ్రామాను తలపించింది. సినీ ఫక్కీలో చింతమనేనిని పోలీసులు ఏలూరు చుట్టూ తిప్పారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని పరిస్థితిలో కార్యకర్తలు ఆందోళన చేశారు. ఏలూరు ఆసుపత్రికి తీసుకొస్తారనే సమాచారంతో కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఆ ప్రకారంగానే... ఏలూరు ఆస్పత్రిలో చింతమనేనికి వైద్య పరీక్షలను పోలీసులు పూర్తి చేయించారు. అక్కడి నుంచి న్యాయస్థానానికి తరలించారు. తెదేపా కార్యకర్తలు కోర్టు ఆవరణలోకి రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. చింతమనేనికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో 14 రోజులు రిమాండ్‌ విధించింది. ఈమేరకు ఆయనను ఏలూరు సబ్‌జైలుకు తరలించారు.

దమ్ముంటే..చూపించండి

పోలీసుల అదుపులో ఉన్న... చింతమనేని మీడియాతో మాట్లాడారు. ఎవరూ తనని అరెస్ట్ చేయలేదని.. స్వచ్ఛందంగా వచ్చానని వెల్లడించారు. విషయాన్ని జఠిలం చేయోద్దని... పోలీసులకు సహకరిస్తాననీ స్పష్టం చేశారు. ఎంత దమ్ము ఉంటే అంతా.. చూపించండి అని చింతమనేని సవాల్ విసిరారు. తప్పు చేసినట్లు బొత్స నిరూపిస్తే ఆస్తులు మొత్తం ప్రజలకు రాసిస్తానని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేస్తున్నారని... బహిరంగ విచారణకు వైకాపా నేతలంతా రావాలని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి:

చలో ఆత్మకూరుకు విఫలయత్నం... చంద్రబాబు దిగ్బంధం

ABOUT THE AUTHOR

...view details