ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CBN: రైతులను పరామర్శించే తీరిక లేదా జగన్​..? వాళ్లు కష్టాల్లో ఉంటే పారిపోతావా..!: చంద్రబాబు - చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి

Chandrababu Naidu visit : కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించే తీరిక ఈ ముఖ్యమంత్రికి లేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతులను పరామర్శించి.. న్యాయం జరిగే వరకూ పోరాడుతామని భరోసా ఇచ్చారు. కష్టాలు వచ్చినపుడు ఆదుకున్న వాడే నాయకుడవుతారని, కష్టాలు చూసి పారిపోతే నాయకుడా అని చంద్రబాబు పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 4, 2023, 4:06 PM IST

Updated : May 4, 2023, 4:32 PM IST

Chandrababu Naidu visit: అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. కష్టాలొచ్చినప్పుడు ఆదుకునేవాడు నాయకుడవుతారు.. కష్టాలు చూసి పారిపోతే నాయకుడవుతారా? అని సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. అరెస్టు చేస్తే చేసుకోండి.. భయపడేది లేదని స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

రైతులను పరామర్శించి.. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ట్రాక్టర్ దిగి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలకు తడిసి దెబ్బతిన్న, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని చంద్రబాబుకు చూపించిన రైతులు.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. చిరిగిన సంచులు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చేతకాని దద్దమ్మ సీఎం.. రైతుల గోడు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా ధాన్యం మొలకలొచ్చింది.. ఇంకా 60 శాతానికి పైగా ధాన్యం పొలాల్లోనే ఉందని తెలిపారు. రైతుల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని పేర్కొన్నారు. చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. ఆయనకు బాధ్యత లేదా... ఎందుకు రైతుల వద్దకు రారు అని ప్రశ్నించారు. హుద్‌హుద్‌ తుఫాన్ సమయంలో అహర్నిశలు పనిచేశానని గుర్తు చేసిన చంద్రబాబు.. ఆ సమయంలో జగన్‌ అటు వైపు చూడలేదని తెలిపారు. అదేమంటే.. అధికారంలో లేనని ఆనాడు చెప్పిన జగన్‌.. ఇప్పుడు అధికారంలో ఉన్నదెవరు, ఎందుకు రాలేదు..? అని చంద్రబాబు మండిపడ్డారు.

రైతు భరోసా కేంద్రాలు కాదు.. దగా కేంద్రాలు.. రైతులను పరామర్శించే తీరిక లేదా..? ధాన్యం సంచులు కూడా ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఏమనాలి?.. ఈ నాలుగేళ్లలో ఎప్పుడైనా జగన్ పొలంలో దిగారా? అని ప్రశ్నించారు. ఓ వైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపనా?.. ఆ శంకుస్థాపన కూడా గతంలో చేసిన దానికి మళ్లీ చేస్తారా అని దుయ్యబట్టారు. చెత్త ముఖ్యమంత్రి.. చెత్త వ్యవస్థను తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు కాదు.. దగా కేంద్రాలుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. రైతులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అరెస్టు చేస్తే చేసుకోండి.. భయపడేది లేదని అన్నారు. కష్టాలొచ్చినప్పుడు ఆదుకునేవాడు నాయకుడవుతారు.. కష్టాలు చూసి పారిపోతే నాయకుడవుతారా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి.. తల నిమిరావు.. ఇప్పుడేమైంది అంటూ జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళా రైతు కుమార్తె చదువుకు రూ.2.30 లక్షలు చంద్రబాబు అందజేశారు.

ఇవీ చదవండి :

Last Updated : May 4, 2023, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details