పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా మహిళలు నిరసన బాట పట్టారు. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో మద్యం దుకాణాలు తెరవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తణుకు తహసీల్దార్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ అమల్లో ఉన్న నెలన్నర రోజుల్లో పేద మధ్యతరగతి వర్గాలకు తిండి, ఉపాధి లేక ఇబ్బందులు పాలైన సమయంలో మద్యం దుకాణాలు తెరవడం దారుణమని పేర్కొన్నారు. .
మద్యం దుకాణాలు తెరవడం పట్ల మహిళల ఆగ్రహం - tanuku latest bar shops news
తణుకులో మద్యం దుకాణాలు తెరవడం పట్ల తెదేపా మహిళలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో షాపులను తెరవడం పట్ల అభ్యంతరం తెలిపారు.
తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న తెదేపా మహిళలు