ఇటీవల కొవిడ్‌కు గురై మృతి చెందిన తణుకు మాజీ కౌన్సిలర్ పిల్లా రాంబాబు కుటుంబ సభ్యులను... మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. పార్టీ బలోపేతానికి రాంబాబు తన వంతు పాత్ర పోషించారని కొనియాడారు. వీరనారాయణ థియేటర్ వద్ద తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానకి విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
పార్టీ నాయకుల తరఫున రూ. లక్ష చెక్కును... రాంబాబు భార్యా పిల్లలకు అందజేశారు. నిబద్ధత కలిగిన నాయకులకు కార్యకర్తలకు తెదేపా ఎల్లప్పడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాంబాబు కుటుంబానికి భవిష్యత్తులోనూ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.