తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై ధర్నా చేశారంటూ.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో అరెస్ట్ చేసిన పోలీసులు.. పశ్చిమగోదావరి జిల్లాకు తరలించినట్టు సమాచారం.
chintamaneni prabhakar: తెదేపా నేత చింతమనేని అరెస్ట్.. పార్టీ నేతల ఆగ్రహం - ఏపీ వార్తలు
tdp mla chintamaneni prabhakar arrest
21:14 August 29
tdp mla chintamaneni prabhakar arrest
తెదేపా నేతల ఆగ్రహం
చింతమనేని అరెస్టుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెట్రో ధరలపై నిరసన తెలపడం నేరమా? ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా?' అని ప్రశ్నించారు. కేసులు, అరెస్టులతో తెదేపా నేతలను అడ్డుకోలేరన్న అచ్చెన్న.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 29, 2021, 10:31 PM IST