ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరిమిల్లి రాధాకృష్ణ గృహ నిర్బంధం...పోలీసుల తీరుపై తెదేపా ఆగ్రహం

తెదేపా చేపట్టిన నా ఇల్లు నా సొంతం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉన్నందున నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఈ విషయం తెలిసిన తెదేపా శ్రేణులు ఆరిమిల్లి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసుల తీరుపై ఆరిమిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు.

arimilli radhakrishna
arimilli radhakrishna

By

Published : Nov 7, 2020, 4:25 PM IST

తెదేపా చేపట్టిన 'నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి' కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. తణుకు మండలం వేల్పూరులోని ఆయన స్వగృహాన్ని తెల్లవారుజామునే ముట్టడించిన పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

రాధాకృష్ణ గృహ నిర్బంధం గురించి తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన గృహానికి తరలివచ్చారు. పార్టీ శ్రేణులతో కలిసి రాధాకృష్ణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉన్నందున తాము అనుమతించలేమని తణుకు సీఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పట్టించుకోవడం లేదని, తమను మాత్రం ప్రతి చిన్న విషయానికి గృహ నిర్బంధం చేస్తున్నారని రాధాకృష్ణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయడం తగదన్నారు.

'వైకాపా ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోంది. ప్రతిపక్ష పార్టీలు చేసే కార్యక్రమాలు అడ్డుకోవడానికి ప్రభుత్వ నియంతృత్వ ధోరణి అవలంబిస్తోంది. మా ప్రభుత్వ హయాంలో ఇదే ధోరణి అవలంబిస్తే జగన్మోహన్ రెడ్డి మూడు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేయగలిగేవారా? తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసే వరకు మా పోరాటం ఆగదు.'

--- ఆరిమిల్లి రాధాకృష్ణ , మాజీ ఎమ్మెల్యే

ఇదీ చదవండి

'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'

ABOUT THE AUTHOR

...view details