ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలోకి వలసలు.. సంక్షేమం చూసే అంటున్న నేతలు - Tanuku Latest News

తణుకు మండలం తేతలికి చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలు వైకాపాలో చేరారు. వీరికి కండువా కప్పి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వైకాపాలోకి ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరుతున్నట్టు... నాయకులు తెలిపారు.

తెదేపా నుంచి వైకాపాలోకి
తెదేపా నుంచి వైకాపాలోకి

By

Published : Apr 4, 2021, 5:59 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో తెలుగుదేశం పార్టీ నుంచి నేలతు వైకాపాలో చేరారు. తెలుగుదేశం మద్దతుతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సరెళ్ల శాంతిప్రియ గ్రామ సర్పంచిగా, ఆమె వర్గంలో ఎనిమిది మంది వార్డు సభ్యులుగా గెలిచారు. మెజారిటీ ఉన్న కారణంగా.. అదే వర్గానికి చెందిన కోట నాగేశ్వరరావు ఉపసర్పంచి పదవికి ఎన్నికయ్యారు.

సర్పంచి శాంతిప్రియ, ఉపసర్పంచి కోట నాగేశ్వరరావు, వార్డు సభ్యులు, కార్యకర్తలతో కలిసి తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు సమక్షంలో వైకాపాలో చేరారు. వారందరికీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే.. వైకాపాలోకి స్వాగతించారు. వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరుతున్నట్టు... నాయకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details