పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఇన్చార్జ్ ఎంపికకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా కంఠమనేని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరిలను నియమించినట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మాజీమంత్రి కె.ఎస్.జవహర్ పోటీ చేసి గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కొవ్వూరు నుంచి, జవహర్ కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. వంగలపూడి అనిత 2014లో పోటీ చేసి గెలుపొందిన పాయకరావుపేటకు తిరిగి ఇన్చార్జ్గా పార్టీ ప్రకటించింది. తిరువూరు స్థానానికి ఇన్చార్జ్గా దేవదత్‌ను పార్టీ ఖరారు చేయటంతో తన పాత నియోజకవర్గం కొవ్వూరుపై జవహర్ ఆశలు పెట్టుకున్నారు.
TDP: కొవ్వూరుపై తెదేపా దృష్టి..ఇన్చార్జ్ ఎంపికకు ద్విసభ్య కమిటీ - కొవ్వురు రాజకీయ వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఇన్చార్జ్ ఎంపికకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా కంఠమనేని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరిలను నియమించారు.
Tdp