పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలు తణుకులో ఘనంగా నిర్వహించారు. వీర నారాయణ, వెంకటేశ్వర థియేటర్ల సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలను నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చారని... పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. అనంతరం పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు.
తణుకులో ఘనంగా ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలు - రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ ఛైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్
స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి వేడుకలను తెదేపా శ్రేణులు తణుకులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలను నాయకులు గుర్తు చేశారు.
తణుకులో ఘనంగా ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలు