REVENUE ADMINISTRATION: పశ్చిమగోదావరి జిల్లా తణుకు రెవెన్యూ కార్యాలయ భవనాన్ని 1887వ సంవత్సరంలో నిర్మించారు. అంటే స్వాంతంత్రం సిద్ధించకముందు.. బ్రిటీష్ వాళ్లు దీన్ని నిర్మించారు. గోస్తని కాలువ పక్కనే ఉండడంతో.. ఈ కార్యాలయం అప్పట్లో జల రవాణాకు బాగా ఉపయోగపడేది. అంతచరిత్ర ఉన్న ఈ ఆఫీస్‌లో ఎంతో మంది అధికారులు పనిచేశారు. ఎన్నో సేవలు అందించారు.
నాటి చరిత్ర గురించి.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా.. పదిమందికీ తెలిపే ప్రయత్నం చేశారు ప్రస్తుత తహసీల్దార్ ప్రసాద్. పాత దస్త్రాల మధ్య నలిగిపోతున్న ఈ కార్యాలయ చరిత్రను.. ఛాయాచిత్రాల రూపంలో బయటకుతెచ్చారు. నామరూపాల్లేకుండా ఉన్న ఫొటోలకు కొత్త రూపు ఇచ్చారు.