పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి మంగళవారం కొన్ని వానరాలు ఆహారం కోసం వెతుక్కుంటూ స్టేషన్ ప్రాంగణంలోకి వచ్చాయి. వాటిని గమనించిన ఎస్సై రవికుమార్.... తన ఉదారతను చాటుకున్నారు. వెంటనే సిబ్బందితో పుచ్చకాయలు, అరటి పండ్లు తెప్పించి వాటికి అందించారు. దీన్ని గమనించిన పలువురు స్థానికులు ఏస్సై మానవత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వానరాల ఆకలి తీర్చిన ఎస్సై రవికుమార్.. - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు
ఖాకీ దుస్తుల మాటున కఠినత్వమే కాదు మానవత్వం కూడా ఉంటుందని నిరూపించారు పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీసులు. ఆహారం వెతుక్కుంటూ పోలీస్స్టేషన్ ప్రాంగణంలోకి వచ్చిన వానరాలకు పండ్లు ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు.
వానరాల ఆకలి తీర్చి మానవత్వం చాటిన ఎస్సై రవికుమర్