ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపు గ్రామాల్లో తణుకు ఎమ్మెల్యే పర్యటన - ముంపు గ్రామాలలో పర్యటించిన తణుకు ఎమ్మెల్యే

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని ముంపు గ్రామాల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. రైతులకు పరిహారం అందజేస్తామని తెలిపారు.

Tanuku MLA  visited  flood  villages
ముంపు గ్రామాలలో పర్యటించిన తణుకు ఎమ్మెల్యే

By

Published : Oct 18, 2020, 6:40 PM IST

Updated : Oct 19, 2020, 4:22 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని వరద బాధిత గ్రామాల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అత్తిలి మండలం వరిఘేడు, తిరుపతిపురం, బల్లిపాడు తదితర గ్రామాల్లో పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు.

రైతు వివరాలు నమోదు చేసి పరిహారం అందేలా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఇళ్లల్లో నీళ్లు ప్రవేశించిన కుటుంబాల వారికి భోజన సదుపాయాలు కల్పించామన్నారు. వరద బాధిత కుటుంబాలకు బియ్యం, కందిపప్పు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. బాధితులు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

Last Updated : Oct 19, 2020, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details