పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. ఇరగవరంలోని మహిషాసుర మర్ధిని పాలేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మీ హోమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలనీ.. ఆర్థికంగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ అభిషేకం నిర్వహించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తంగిరాల ప్రదీప్ సిద్ధాంతి ఆధ్వర్యంలో వేద పండితులు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం... తణుకు ఎమ్మెల్యే హోమం - ఇరగవరంలో ఎమ్మెల్యే కాకమూరి వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు... నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలంటూ హోమం నిర్వహించారు. ఇరగవరంలోని పాలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తణుకు ఎమ్మెల్యే హోమం