ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పవన్‌కళ్యాణ్‌ అప్పుడెందుకు స్పందించలేదు..?' - Pawan Kalyan

జగన్‌ 100 రోజుల పాలనపై పుస్తకం విడుదల చేసిన జనసేన అధినేత పవన్​కళ్యాణ్... గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీపై ఎందుకు మాట్లాడలేదని... తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రశ్నించారు.

కారుమూరి వెంకట నాగేశ్వరరావు

By

Published : Sep 15, 2019, 9:51 PM IST

కారుమూరి వెంకట నాగేశ్వరరావు

వైకాపా ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఖండించారు. తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోయినా పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇసుక దోపిడీ చేసినా కనీసం విమర్శించని పవన్‌కళ్యాణ్‌... ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై పుస్తకం విడుదల చేయడం దారుణమన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోయినా... విమర్శించే ధోరణి మంచిదికాదని హితవుపలికారు. రాజకీయాల్లో ఎదగాలనుకునే నేతలు ఓపికపట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details