అన్నపూర్ణ దేవిగా.. తణుకు కనకదుర్గమ్మ
కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయాల్లో నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఉన్న కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరించారు. ప్రత్యేక పూజలు అందుకుంటూ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గోస్తనీ తీరాన ఉన్న కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో ఆకట్టుకునేలా అలంకరించారు. అమ్మవారు వామ హస్తంలో రసాన్న పాత్ర ధరించి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆది భిక్షువు పరమశివునికి అన్న ప్రసాదం చేస్తున్నట్లుగా ఉంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే అన్నపానీయాలకు లోటుండదని భక్తులు నమ్ముతారు. కరోనా కారణంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థాన పాలకవర్గం దర్శనానికి ఏర్పాట్లు చేసింది.
ఇదీ చూడండి: లైవ్: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో... మోహినీ అవతారంలో తిరుమల శ్రీవారు..