కరోనా కట్టడిలో ఫ్రంట్ వారియర్స్‌గా ఉన్న వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖలు, పారిశుద్ధ్య కార్మికులు తదితర సిబ్బందికి ప్రభుత్వం బీమా సదుపాయం కల్పించాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖల అధికారుల సిబ్బందితో పాటుగా ఎనలేని కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కోరారు.
కరోనా నియంత్రణంలో ప్రభుత్వం విఫలమైందని... ముఖ్యమంత్రితో సహా వైకాపా నాయకులు ఈ విషయాన్ని చులకన భావంతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం సీఎం జగన్ మాస్కు ధరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా విషయంలో పేద బడుగు వర్గాలను పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారని ఆయన విమర్శించారు. వైకాపా నాయకులు మాత్రం తమకు కరోనా వస్తే ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారని అన్నారు.