ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకు జిల్లా ఆస్పత్రిలో కరోనా కలకలం - corona effect on west godavari district

పశ్చిమగోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులకు, సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఆస్పత్రిలోని మొత్తం సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు.

tanuku-district-hospital
తణుకు జిల్లా ఆస్పత్రి

By

Published : Jul 15, 2020, 12:11 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని… జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులకు, సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. పాజిటివ్ నిర్ధరణ అయిన వైద్యులు, సిబ్బందికి ఆస్పత్రిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు చికిత్స అందించే సమయంలో పాజిటివ్ ఉన్న రోగి నుంచి సంక్రమించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈనెల 9న భీమవరం ప్రాంతానికి చెందిన గర్భిణీకి అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ జరగడానికి రెండు రోజుల ముందు ఆమె నుంచి కరోనా నిర్ధరణ నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. శస్త్రచికిత్స ముగిసిన తర్వాత కరోనా నివేదికలో ఆమెకు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరందరికీ నెగెటివ్ వచ్చింది. ఈ కేసుతో సంబంధం లేని వైద్యులకు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో… ఆస్పత్రిలోని మొత్తం సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details