ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన రెల్లి సంజీవరావు. బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతూ.. పతకాలు సాధిస్తున్నాడు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సతీష్.. సంజీవరావుకు బ్యాడ్మింటన్‌పై ఉన్న ఆసక్తిని గమనించారు. వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంలోనే.. జాతీయ స్థాయి పోటీల్లో సంజీవరావు సత్తా చాటాడు. కోచ్ సతీష్ సహకారంతో... శ్రీ చిట్టూరి సుబ్బారావు - పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరాడు. అకాడమీ వ్యవస్థాపకులు చిట్టూరి సుబ్బారావు... సంజీవ రావు శిక్షణ ఖర్చ భరించడమేగాక, ఆర్థికంగానూ తోడ్పాటు అందిస్తున్నారు.
జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో 5 సార్లు బంగారు పతకాలు, ఒకసారి వెండి, 7 సార్లు కంచు పతకాలు గెలిచాడు సంజీవరావు. సబ్ జూనియర్ విభాగంలో.. భారత్ తరఫున 3 సార్లు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నాడు. రెండు సార్లు మియన్మార్.. ఒకసారి ఇండోనేషియాలో జరిగిన పోటీలకు హాజరై సత్తా చాటాడు. సంజీవరావు అంతర్జాతీయ వేదికలపై రాణించేలా.. సహకారం కొనసాగిస్తామని కోచ్‌తోపాటు అకాడమీ ప్రతినిధులు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యం అంటున్నాడు సంజీవరావ్.