ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపూడి కాలువకు గండ్లు.. నీట మునిగిన పంటలు - తాడిపూడి కాలువకు గండి

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గుండా ప్రవహిస్తున్న తాడిపూడి కాలువకు పలుచోట్ల గండి పడింది. వరి, పామాయిల్, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. వరిచేలల్లో నీళ్లు నిలిచాయి. నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంటలు పాడవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తాడిపూడి కాలువకు గండి
తాడిపూడి కాలువకు గండి

By

Published : Jul 15, 2020, 3:14 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గుండా ప్రవహిస్తున్న తాడిపూడి కాలువకు పలుచోట్ల గండి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి, పామాయిల్, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో కాలువకు గండ్లు పడ్డాయి.

తిమ్మయ్యపాలెం, అక్కుపల్లి గోకవరం, కైకరంలోని పాత హరిజనపేట, బీసీ కాలనీ, వెంకట కృష్ణాపురం, బ్రహ్మానందపురం ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రహదారులు కోతకు గురయ్యాయి. వరిచేలల్లో నీళ్లు నిలిచాయి. నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంటలు పాడవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details