నిట్ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఫేజ్ వన్ బి కింద రూ.210 కోట్లతో వివిధ రకాల భవన నిర్మాణాలను గతేడాది చేపట్టగా ఆయా నిర్మాణాలు ప్రస్తుతం చివరి దశకు చేరుకుని అబ్బురపరుస్తున్నాయి. ప్రాంగణంలోని డివైడర్లపై ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాత్రిళ్లు మిరుమిట్లుగొలుపుతూ జాతీయ రహదారిపైగా రాకపోకలు సాగించే వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థ జిల్లాకు తలమానికంగా నిలుస్తోంది.
పూర్తయిన భవనాలు
నిట్ ఫేజ్-1 బి భవనాల నిర్మాణాలకు సంబంధించి సెంట్రల్ పబ్లిక్ వర్క్సు డిపార్ట్‌మెంట్ గతంలో టెండర్లు పిలవగా పుణేకు చెందిన బీజీ షీర్కే కంపెనీ దక్కించుకుంది. ఇందులో పరిపాలన భవనం, గ్రంథాలయం, అకడమిక్ భవనం, ఏసీ ప్లాంట్, వసతిగృహాలు, భోజనశాల, ప్రయోగశాల వంటివి ఉన్నాయి. ఆయా భవనాలను 5 లక్షల అడుగుల విస్తీర్ణంలో ప్రీక్యాస్టింగ్ పద్ధతిలో 13 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా కొవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం భవన నిర్మాణాలన్నీ చివరి దశకు చేరుకున్నాయి. కొన్నింటికి రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. ఒక భవనం నుంచి మరో భవనానికి వెళ్లేందుకు వీలుగా ప్రాంగణంలో అంతర్గత సీసీ రహదారులను తీర్చిదిద్దారు. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచిపోకుండా సాఫీగా వెళ్లేందుకు భూగర్భ కాలువ వ్యవస్థను నిర్మించారు. భవనాల మధ్య ఆహ్లాదాన్నిచ్చే వివిధ రకాల మొక్కలను, ఉద్యాన వనాలను తీర్చిదిద్దారు. సంస్థ ముఖద్వారం నుంచి బాలికల వసతిగృహం వరకూ రన్‌వే మధ్యన డివైడర్ని తీర్చిదిద్దారు. ఇందులో ఎల్‌ఈడీ దీపాలతో ఉన్న విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆయా దీపాలు రాత్రిళ్లు పున్నమి నాటి వెన్నెలను తలపిస్తున్నాయి. ఫేజ్ వన్ ఏ కింద 5.50 లక్షల అడుగుల విస్తీర్ణంలో గతంలో రూ.206 కోట్లతో విద్యార్థులకు అనువుగా వివిధ రకాల భవన సముదాయాలను నిర్మించారు.
రెండో గేటు