తాడేపల్లిగూడెం తెదేపాలో అసమ్మతి - rebel
తాడేపల్లిగూడెం తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వెంకట మధుసూదనరావును అధిష్ఠానం ఖరారు చేయడంపై జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని పునః పరిశీలన చేసి... జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెదేపా అభ్యర్థిగా ... మాజీ ఎమ్మెల్యే వెంకట మధుసూదనరావును అధిష్ఠానం ఖరారు చేయడంపై జిల్లా పార్టీ నాయకులు... కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని పునః పరిశీలన చేసి... జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గత 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని పక్కనబెట్టడం సరికాదంటున్నారు. నియోజకవర్గంలో తెదేపా జెండా పట్టుకునే నాయకుడే లేనప్పుడు... బాపిరాజు ముందుండి నడిపించారన్నారు. కుటుంబం కంటే పార్టీ ముఖ్యమని భావించిన వ్యక్తికి అన్యాయం జరిగితే పార్టీ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోతారని ఆవేదన చెందారు.