మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ను.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు విడుదల చేశారు. మొదట కేకును కట్ చేసి చిరు అభిమానులకు తినిపించారు. అనంతరం వారితో కలిసి ట్రైలర్ వీక్షించారు. సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడ్డారని, బాగా నటించారని ప్రశంసించారు. కష్టానికి ఫలితం లభిస్తుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
సైరా.. ట్రైలర్ విడుదల చేసిన తణుకు ఎమ్మెల్యే - mega fans
సైరా సూపర్ హిట్ అవుతుందని... చిరంజీవి కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా ట్రైలర్ ను తణుకులో మెగా అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.
సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ విడుదల చేసిన తణుకు ఎమ్మెల్యే