Swami Vivekananda Seva Samiti New buildings: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో స్వామి వివేకానంద సేవాసమితికి సంబంధించి నూతన నిర్మాణాలను వైభవంగా ప్రారంభించారు. రామకృష్ణ జ్ఞానమందిరం, శారదాదేవి సమావేశ మందిరం, వివేకానంద వ్యక్తిత్వ వికాస్ ప్రాంగణం, సమితి కార్యాలయం, సాధువుల వసతి భవనాలను.. రామకృష్ణ మఠం మిషన్, బెలూరు మఠం ఉపాధ్యక్షులు స్వామి గౌతమ్ నందాజీ మహరాజ్ ప్రారంభించారు. స్వామి వివేకానంద విగ్రహాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
పెదఅమిరంలో అధ్యాత్మిక పరిమళం.. ఉప్పొంగిన భక్తిభావం - west godavari district news
పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో స్వామి వివేకానంద సేవాసమితికి సంబంధించిన నూతన నిర్మాణాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నిర్మాణాలు చేపట్టిన దాత శివ వర్మను ప్రముఖులు అభినందించారు.
Swami Vivekananda Seva Samiti New buildings
ఈ సందర్భంగా.. స్వామీజీలు, ప్రముఖులు ఉపన్యసించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో.. దృఢమైన సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. మన పూజగదిలో భగవత్గీత, రామాయణం ఉంచడమే కాకుండా.. వాటిలోని అంశాలను ప్రతిరోజూ స్మరిస్తూ ఉండాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టిన దాత శివ వర్మను ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చదవండి:
Last Updated : Jun 29, 2022, 7:15 PM IST