ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎం ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య..? - ఫార్మసీ విద్యార్థి మృతి

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎం ఫార్మసీ చదువుతున్న అలేఖ్య అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దీనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య లేదా ఎవరైనా చంపి ఇలా చేసి ఉండవచ్చా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో ఫార్మసీ విద్యార్థి మృతి

By

Published : Nov 11, 2019, 8:03 PM IST

విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసుల విచారణ

పశిమగోదావరి జిల్లా భీమవరంలో అలేఖ్య అనే ఎం ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడకు చెందిన అలేఖ్య పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎం ఫార్మసీ చదువుకుంటూ వేరేగా గది తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటోంది. శని, ఆదివారం సెలవు కావటంతో స్నేహితులంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరూ లేని సమయంలో అలేఖ్య ఉరి వేసుకుని చనిపోయింది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ యువతి రాసిన సూసైడ్ నోట్ ఆమె గదిలో లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, హత్య లేక ఆత్మహత్యేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details