ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు - తణుకులో సూపర్ శానిటైజేషన్

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు చర్యలు చేపట్టారు. వీధులలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. వారం రోజుల్లో అన్నిప్రాంతాల్లో సూపర్ శానిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

tanuku
తణుకులో సూపర్ శానిటైజేషన్ కార్యక్రమం

By

Published : May 23, 2021, 4:54 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో కరోనా రెండో దశ విజృంభణతో పురపాలక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

కరోనా రెండో దశ ప్రారంభమైన తర్వాత తణుకు పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు ఎనిమిది వందల కేసులు నమోదయ్యాయి. ఇవి కాక లెక్కలోనికి రాని కేసులు మరో రెండు రెట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పట్టణమంతా సూపర్ శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు ట్రాక్టర్లు, ఒక ఆటోను దీనికోసం వినియోగించారు. ఆదివారం మరింత ఎక్కువగా శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారులు అనుబంధ రహదారుల్లో అన్ని దుకాణాల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో పట్టణంలోని మారుమూల ప్రాంతాలతో సహా అంతా శానిటైజేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కేసులు అదుపులోనికి వచ్చేవరకు సూపర్ శానిటైజేషన్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details