ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో సూపర్ శానిటేషన్.. ప్రారంభించిన ఎమ్మెల్యే - పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సూపర్ శానిటేషన్ కార్యక్రమం

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. తణుకులో సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. పట్టణ ప్రజలంతా.. మాస్కులు ధరించి, పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

super sanitation
super sanitation

By

Published : May 4, 2021, 8:12 PM IST

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంపై.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని.. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని పట్టణమంతా.. సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శానిటేషన్ చేశారు.

పట్టణంలో ప్రధాన రహదారులు, ప్రధాన వీధులతో పాటు కాలనీలు, మారుమూల ప్రాంతాల్లో సైతం శానిటేషన్ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా తీవ్రంగా విజృంభిస్తుండటంతో.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరుచూ చేతులను శుభ్రంగా చేసుకోవటంతో పాటు ఎప్పటికప్పుడు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించడం వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details