ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. నిత్యం కళకళలాడే వీధులన్నీ ఉదయమే నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆహ్లాదానికి నెలవైన పశ్చిమగోదావరి జిల్లా సైతం ఈ సారి భానుడి ప్రతాపానికి వణికి పోతోంది. తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.
గోదారి తీరంలో... భానుడి భగభగలు - summer effect
పచ్చిక బయళ్లతో ఆహ్లాదాన్ని పంచే గోదావరి తీరం అగ్నిగోళంగా మారింది. ఉదయం నుంచే భానుడి ప్రతాపం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఉండ్రాజవరం పరిసరాల్లో ఎన్నడూ లేనివిధంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.
గోదారి తీరంలో... భానుడి భగభగలు
" 'సూర్య' తాపానికి పల్లె నుంచి పట్టణం వరకూ అల్లాడిపోతోంది. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఇలానే నమోదవుతాయనే వాతావరణ శాఖ హెచ్చరికి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. "