మినీ గోకులం బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఒక రైతు పశుసంవర్ధక శాఖ అధికారుల ముందు బోరున విలపించాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన కంభంపాటి సత్యనారాయణ సాధారణ సన్నకారు రైతు..తనకున్న ఇరవై ఐదు సెంట్ల కొద్దిపాటి భూమికి తోడు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వ్యవసాయానికి ఆసరాగా ఉంటుందని పాడిగేదెను కూడా పెంచుతున్నాడు. మినీ గోకులం నిర్మించుకుంటే నిర్మాణ ఖర్చు లో 90 శాతం ప్రభుత్వం భరిస్తుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పడంతో అప్పు చేసి మరి లక్షల 80 వేల రూపాయలతో గోకులాన్ని నిర్మించుకున్నాడు. లేబర్ కాంపౌండ్ చార్జీలు కింద పదివేల రూపాయలు మాత్రమే అతనికి ఖాతాలో జమ అయ్యాయి.
దీనిపై పశుసంవర్ధక శాఖ పెంటపాడు డీడీ విశ్వేశ్వరరావు తాడేపల్లిగూడెం పెంటపాడు ఏడీలు నాయక్ భాషలు బుధవారం ఉంగుటూరు వచ్చారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ తన వెంట తీసుకొచ్చిన పెట్రోలును అధికారుల ముందు ఉంచాడు. దీంతో అధికారులు సత్యనారాయణను సముదాయించే ప్రయత్నం చేశారు. వారం రోజుల్లో తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సత్యనారాయణ బోరున విలపించాడు.
మినీ గోకులం బిల్లు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యం - పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన కంభంపాటి సత్యనారాయణ మినీ గోకులం బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ పెట్రోలును అధికారుల ముందు ఉంచాడు. వారం రోజుల్లో తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సత్యనారాయణ బోరున విలపించాడు.
బిల్లు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యం