జనతా కర్ఫ్యూకు పూర్తిస్థాయిలో జనం సహకరించాలని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్, కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి కోరారు. జనం స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతోనే జిల్లాలో జనతా కర్ఫ్యూ లక్ష్యం నెరవేరుతుందన్నారు. పోలీసు పర్యవేక్షణ ఉంటుందన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. చర్చిలు, దేవాలయాలు, మసీదులు, విద్యాలయాలు అన్నీ మూసివేయల్సిందేనని స్పష్టం చేశారు.
'జిల్లాలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి' - latest corona news in west godavari district
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లాలో జరిగే జనతా కర్ఫ్యూకు ప్రజలందరు సహకరించాలని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ కోరారు.
'జిల్లాలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి'