ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోట్లు వెచ్చించి కొన్న పేదల ఇళ్ల స్థలాల్లో ముంపు.. లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు

ఇల్లు కట్టుకోవాలంటే.... అన్నీ వివరాలు సేకరించి అనువైన స్థలాన్నే కొంటాం. చుట్టు పక్కల పరిస్థితుల్ని తెలుసుకుని ఇబ్బందులేమీ లేని భూమినే ఎంచుకుంటాం. కానీ తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు మాత్రం పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ కోట్లు వెచ్చించి ముంపు భూముల్ని కొనేశారు. వర్షాలు, వరదతో నిండా మునిగిన ఆ భూముల్లో సమస్యను పరిష్కారం కోసమంటూ 74కోట్ల వ్యయంతో ఎత్తిపోతలను తెరపైకి తెచ్చారు. అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక చూద్దామంటూ నిపుణలు దీన్ని పక్కనపెట్టడంతో ఎలాంటి ముంపు లేకుండా పేదలకు స్థలాలు పంచుతామన్న అధికారులకు ఇప్పుడేం చేయాలో తోచడం లేదు. ఇళ్ల స్థలాల కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడంలేదు.

Aava Lands not usefull for staying
ఆవ భూములు నివాసయోగ్యం కాదు

By

Published : Aug 3, 2021, 4:27 AM IST

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని ఆవ భూములు నివాసయోగ్యం కాదని తెలిసినా గత ఏడాది కొనుగోలు చేసిన వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. రాజమహేంద్రవరం నగరంలోని 22 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కోరుకొండ మండలం కాపవరం, బూరుగుపూడి గ్రామాల పరిధిలోని 586.96 ఎకరాలు కొనుగోలు చేశారు. ఎకరం ఏకంగా 45 లక్షలు చెల్లించేందుకు ఒప్పందాలు పూర్తయ్యాయి. దాదాపు 250 ఎకరాలకు సంబంధించి 112 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు పూర్తైనట్లు సమాచారం. ఈ భూములు రాజమహేంద్రవరం-కోరుకొండ రహదారికి 10 నుంచి 12 అడుగుల లోతులో ఉంటాయి. గోదావరి వరదల సమయంలో ఆవ భూములు పూర్తి ముంపు బారిన పడతాయి. పేదల ఇళ్ల స్థలాల కోసం నిండా మునిగిపోయే భూములు అధిక ధరలకు కొనుగోలు చేయడం పెద్ద వివాదమైంది. అవి ముంపు భూములు కావని గతంతో కొట్టిపడేసిన జిల్లా రెవెన్యూ అధికారులకు ప్రస్తుతం వరద నీటిలో మునిగిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ముంపునకు గురయ్యే ఈ ఆవ భూములను పేదల స్థలాలకు సేకరించడంపై గతంలో కొందరు అఖిలపక్షంగా ఏర్పడి పోరాటాలు చేశారు. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఇక్కడ యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయస్థానం స్టే ఇచ్చింది.

వందల ఎకరాలు ముంపులోనే

కోరుకొండ మండంలంలోని బూరుగుపూడి, కాపవరంలో కోట్లు పోసి కొనుగోలు చేసిన ఆవ భూములు వర్షాకాలంలో దశాబ్దాల నుంచి ముంపులో చిక్కుకుంటాయి. కోరుకొండ, సీతానగరం మండలాల్లో తొర్రిగడ్డ డ్రైనేజీ వల్ల 23,416 ఎకరాలు ముంపు బారిన పడతాయని జలవనరుల శాఖ నివేదికలు చెబుతున్నాయి. అలాంటి చోట 586.96 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆవ భూములకు ఓ వైపున వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న జగ్గప్పచెరువు, మరోవైపు శ్రీ రంగపట్నం రాజా చెరువు ఉన్నాయి. వర్షాకాలంలో వరద నీరు బూరుగుపూడి, కాపవరం గ్రామాల మీదుగా తొర్రిగడ్డ డ్రైనేజీలో కలుస్తుంది. బురదకాల్వ, కూనవరం డ్రైయిన్ల నుంచి వచ్చే వరద కూడా తొర్రిగడ్డ డ్రైనేజీకి చేరుతుంది. ఈ నీరంతా సీతానగరం మండలం బొబ్బిలంక వద్ద గోదావరిలో కలుస్తాయి.

19 మీటర్లపైగా నిలిచిపోయిన నీరు

గోదావరి వరద సమయంలో తొర్రిగడ్డ షట్టర్లు మూసుకుపోతాయి. నీరు వెనక్కివచ్చి కోరుకొండ మండలంలో పొలాలు మునిగిపోతాయి. ఈ సమయంలో 19 మీటర్లపైగా నీరు నిలిచిపోతుంది. ఇంతలా వరదల ముంపులో చిక్కుకునే భూముల్ని ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఎలా కొనుగోలు చేసిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


అప్పుడే నిర్ణయం తీసుకుంటే మంచిదని...

పేదల కోసం సేకరించిన ఈ భూముల్లో ముంపు సమస్య పరిష్కారం కోసం తొర్రిగడ్డ డ్రైనేజీ నీటిని గోదావరిలోకి ఎత్తిపోసేందుకు జలనవరులశాఖ అధికారులు ప్రణాళిక రచించారు. 74 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత వరద పరిస్థితి ఎలా ఉంటుందో పరిశీలించి అప్పుడు నిర్ణయం తీసుకుంటే మంచిదని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సూచించారు. కోరుకొండ ఆవ భూముల్లో పేదల కోసం తీసుకున్న భూములు మంపు భూములే అని కాకినాడ జేఎన్ టీయూ నిపుణుల బృందం కూడా తేల్చింది.

ఇదీదవండి..

Sajjala: కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు: సజ్జల

ABOUT THE AUTHOR

...view details