మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలో జలాశయాలు, అనుసంధాన ప్రధాన కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఎర్రకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పులి వాగు, బైనేరు వాగుల వరదనీరు ఎర్ర కాలువలో కలుస్తుండడంతో తణుకు మండలం దువ్వ వద్ద వయ్యేరు కాలువ ప్రవాహం మరింత పెరిగింది. ఫలితంగా పక్కనే ఉన్న నివాస గృహాలు, గుడిసెలు మరింత నీట మునిగాయి.
భారీ వర్షాలకు దువ్వలో నీట మునిగిన గుడిసెలు - దవ్వలోవర్షం
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తణకు మండలం దువ్వ వద్ద గుడిసెలు నీట మునిగాయి. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

దవ్వలో నీటమునిగిన గుడిసెలు
సుమారు 150 మందిని రెవెన్యూ అధికారులు సమీపంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వయ్యేరు గట్టు వెంబడి రాకపోకలు నియంత్రించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదీ చూడండి.దుర్గమ్మ వెండి రథంలోని మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు?