ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో సబ్​జైల్​ కానిస్టేబుల్​ మృతి - sub jail constable suicide news in narsapuram

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో విషాదం జరిగింది. స్థానిక సబ్​ జైలులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్​ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సబ్ జైలర్, పోలీసులు నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయాడని మృతుని కుమార్తె ఆరోపిస్తున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-December-2019/5543595_299_5543595_1577727386484.png
అనుమానాస్పద స్థితిలో సబ్​​ జైల్​ కానిస్టేబుల్​ మృతి

By

Published : Dec 31, 2019, 12:05 AM IST

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో విషాదం జరిగింది. స్థానిక సబ్ జైలులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. తానేశ్వర్రావు గత మూడేళ్లుగా నర్సాపురం సబ్ జైలులో గార్డ్​గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం విధులకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన కుమారుడు సబ్ జైలుకి వచ్చి తన తండ్రితో మాట్లాడాలని చెప్పటంతో... జైలు సిబ్బంది గార్డ్ రూమ్​కి వెళ్లారు. అప్పటికే తానేశ్వర్రావు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు.

అనుమానాస్పద స్థితిలో సబ్​​ జైల్​ కానిస్టేబుల్​ మృతి

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సబ్​ జైల్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. సబ్ జైలులో ఐదుగురు గార్డులు విధులు నిర్వర్తించవలసి ఉండగా... తానేశ్వర్రావు ఒక్కడే విధులు నిర్వహించడంపై మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సబ్ జైలర్, పోలీసులు నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయాడని మృతుని కుమార్తె ఆరోపిస్తున్నారు. విధుల్లో నిర్లక్షంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details