VEMANA PADHYA DHAARANA: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాతృభాషా సేవా సమితి ఆధ్వర్యంలో వేమన పద్య ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1008 మంది విద్యార్థులు 1008 వేమన పద్యాలను ఆలపించే కార్యక్రమాన్ని చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వేర్వేరు సమయాల్లో వేమన పద్యాలను ఆలపించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు వివిధ ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి, వేమన పద్యాల సారాన్ని విద్యార్థులు తెలుసుకునేలా చేయడానికి పద్య ధారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పి.. ఔరా అనిపించారు - Vemana poem Dharana
VEMANA PADHYA DHAARANA: తెలుగు భాషను కాపాడటానికి, దాని ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి విద్యార్థులు సిద్ధమయ్యారు. వివిధ పాఠశాలల విద్యార్థులు వేమన పద్య ధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకేసారి 1008 మంది విద్యార్థులు 1008 పద్యాలను ఆలపించి ఔరా అనిపించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు.
![తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పి.. ఔరా అనిపించారు vemana padhyalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17169065-1022-17169065-1670675864054.jpg)
వేమన పద్యాలు ఆలపిస్తున్న విద్యార్థులు
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన విద్యార్థులు