వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరుతూ.. పశ్చిమగోదావరిలోని ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎంఎస్సీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ రూ. 33,800లతో పాటు వసతిదీవెన కింద రూ. 10,000 చెల్లించాలని.. నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఫీజుకు సంబంధించి రూ. 20 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వసతిదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల ధర్నా - ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కోసం ఏలూరులో విద్యార్థుల ధర్నా
పశ్చిమగోదావరిలోని ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద.. విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించి నిరసన చేపట్టారు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రావాల్సిన మొత్తాలను పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ధర్నా
TAGGED:
eluru collectorate protests