ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు - గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

By

Published : May 17, 2020, 10:57 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారు సింగలూరు వెంకటేష్, అయినం సాయిగణేష్​లుగా గుర్తించారు. వారికోసం అధికారులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడినప్పటికీ పడవలలో లైట్లు ఏర్పాటు చేసి గాలింపు కొనసాగించారు. కొవ్వూరు ఆర్టీవో లక్ష్మారెడ్డి ఘటనస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details