ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమిదలకు రంగులద్దిన చిట్టిచేతులు.. వినూత్నంగా దీపావళి

Diwali celebrated by the children: దీపావళి వస్తుందంటే పిల్లలు ఎంతో సంబరంగా ఎదురు చూస్తారు. ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా? దీపాల మధ్య బాణసంచా కాలుస్తామా అని సంబరపడతారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థులు మాత్రం తమ పాఠశాల ఆవరణలో వినూత్న రీతిలో దీపావళి జరుపుకున్నారు.

1
1

By

Published : Oct 23, 2022, 7:16 PM IST

Innovative Diwali in AP: దీపావళి అంటేనే రంగురంగుల దీపాల సమూహలు అందరి మదిలో ఆవిష్కృతమవుతాయి. ఈ కారణంగానే పురాణ కాలం నుంచి ఇప్పటివరకు ప్రమిదలతో దీపాలను వెలిగించి ఇంటి ముందు ఉంచడం అనవాయితీగా వస్తోంది. ఇదే స్ఫూర్తితో పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు తమ మదిలో మెదిలిన ఆలోచనలకు.. ఉపాధ్యాయుల సలహాలు జోడించి వినూత్న రీతిలో దీపావళి జరుపుకున్నారు. పాఠశాలలో ఎల్​కేజీ నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అంతా కలిశారు. దీపాలు వెలిగించే మట్టి ప్రమిదలకు తమ సృజనాత్మకత జోడించి రంగులద్ది కొత్త ప్రమిదలను తయారు చేశారు.

రంగురంగుల ప్రమిదలతో తమ పాఠశాల లోగో ఆవిష్కరించారు. లోగోతో పాటు, జాతీయ పక్షి నెమలి, సాంప్రదాయ సంగీతానికి ప్రతీకలుగా నిలిచే వాయిద్యాలను ప్రమిదలతో ఆవిష్కృతం అయ్యేలా చేశారు. దీపావళికి అర్థం పరమార్థం అన్నట్లు సృజనాత్మకంగా మట్టి ప్రమిదలకు రంగులద్ది తీర్చిదిద్దడంతోపాటూ.. దీపావళి దీపాలలో పాఠశాల లోగోను, సంప్రదాయాలను ఆవిష్కృతమయ్యేలా చేయటం పట్ల పాఠశాల యజమాన్యం విద్యార్థిని విద్యార్థులను అభినందించింది.

వినూత్నంగా దీపావళి పండుగను నిర్వహించిన స్కూల్ పిల్లలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details