పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని... ఐటీఐ కళాశాల విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట' - పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఏలూరు కలెక్టరేట్‌ను ముట్టడి
తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఏలూరు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు తోపులాట జరిగింది.
ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట
TAGGED:
students arrest