Students agitation in NIT: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమిళ్ మణి అనే బయోటెక్నాలజీ ఫ్యాకల్టీ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని,.. వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ నిట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద విద్యార్థులు బైఠాయించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా హెచ్‌వోడి పట్టించుకోవట్లేదని విద్యార్థులు చెబుతున్నారు. హెచ్‌వోడి బహిరంగ క్షమాపణలు చెప్పి, విధుల నుండి తప్పుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం నిట్‌లో విద్యార్థుల ఆందోళన.. బయో ఫ్యాకల్టీపై చర్యలకు డిమాండ్
Students agitation in NIT: తాడేపల్లిగూడెం నిట్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిట్‌లోని ఓ ఫ్యాకల్టీ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేధింపులకు పాల్పడ్డవారు బహిరంగ క్షమాపణలు చెప్పి, వెంటనే విధుల నుండి తప్పుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
NIT STUDENTS STRIKE
ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు తరగతులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. దీంతో నిట్ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నిట్ ప్రాంగణంలోనికి ఎవరినీ వెళ్ళనీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో మరింత ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇవీ చదవండి: