ఇప్పటికే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రద్దు చేసి అన్నీ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేలా కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటిని ముట్టడించారు. ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ యువతకు మద్దతుగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాల నేతలు - student union Leaders rally news
రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలతో కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటిని ముట్టడించారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని, అన్నీ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ప్రకటించిన జాబ్ క్యాలెండర్... జాబ్ లెస్ క్యాలెండర్ మారిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని ఖాళీలను భర్తీ చేసి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి తెదేపా పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి:CPI Ramakrishna: ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి: సీపీఐ రామకృష్ణ