ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం - latest news in eluru

పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

పోలీసుల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 17, 2019, 6:59 AM IST

పోలీసుల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

చేయని దొంగతనాన్ని ఆపాదించి పోలీసులు వేధిస్తున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన ఏలూరులోని దొంగల మండపం వీధి సమీపంలో ఓ మహిళ దేవాలయానికి వెళ్ళొస్తుండగా ఓ అగంతకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... లంకపల్లి సాత్విక రాజు, అతని స్నేహితులు నవీన్‌ తేజ, ప్రేమ్‌కుమార్‌ అనే ముగ్గురు డిగ్రీ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న మొదటి పట్టణ సీఐ బాల రాజాజీ పలు దఫాలుగా వారిని విచారించి పంపించేశాడు. ఈనెల 16సాయంత్రానికి ఏ విషయం తేల్చకపోతే కేసుపెట్టి అరెస్టు చేస్తామని బెదిరించాడని... మనస్థాపానికి గురైన సాత్వికరాజు ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details