Student suicide attempt: ఓ కళాశాల విద్యార్థుల విచ్చలవిడితనాన్ని బయటపెట్టగా.. అందుకు ప్రతిగా యాజమాన్యం చేసిన నిర్వాకానికి మనస్తాపం చెందిన విద్యార్థిని శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో ఈ నెల 5న జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (19) పాలకొల్లులోని ఒక పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. కోర్సులో భాగంగా అనకాపల్లి జిల్లా వెంకటాపురంలోని కిసాన్ విద్యాకేంద్రంలో శిక్షణ నిమిత్తం జనవరి 30న ఆమెతోపాటు ఆరుగురు విద్యార్థులు వెళ్లారు. వీరికి అక్కడ ఓ భవనంలో వసతి కల్పించారు. కొందరు విద్యార్థుల మధ్య ప్రేమ వ్యవహారం ఉండటంతో రాత్రివేళ అమ్మాయిలు ఉంటున్న గదిలోకి అబ్బాయిలు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించేవారు. బాధిత యువతి దీనిపై వారిని నిలదీసింది. కోపం పెంచుకున్న వారు ఫిబ్రవరి 25న ఆమెపై దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబసభ్యులకు తెలిపింది. అనంతరం తల్లి సూచన మేరకు తోటి విద్యార్థుల అసభ్య ప్రవర్తనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు తీసి తల్లికి ఫోనులో పంపింది. వాటిని ఆమె కళాశాల యాజమాన్యానికి పంపారు. దీనిపై యాజమాన్యం విద్యార్థులను హెచ్చరించింది. కక్ష పెంచుకున్న విద్యార్థులు.. బాధితురాలి ఫోన్ లాక్కుని అందులోని సమాచారాన్ని తొలగించడంతో పాటు ఆమెపై దాడి చేశారు. విషయం తెలిసి ఆమె తల్లి 100కు ఫోన్ చేసి పోలీసులకు తెలిపారు.
Student Suicide Attempt: సహ విద్యార్థుల విచ్చలవిడితనం.. భరించలేక ఆత్మహత్యాయత్నం - సహ విద్యార్థుల విచ్చలవిడితనంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Student suicide attempt: ఓ కళాశాల విద్యార్థుల విచ్చలవిడితనాన్ని బయటపెట్టగా.. అందుకు ప్రతిగా యాజమాన్యం చేసిన నిర్వాకానికి.. ఓ విద్యార్థిని మనస్తాపానికి గురైంది. దీంతో శానిటైజర్ సేవించి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 5న జరిగింది.
విశాఖ పోలీసులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేసు నమోదు చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కళాశాల యాజమాన్యం బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పడంతో రాజీపడ్డారు. దాడికి పాల్పడిన విద్యార్థులలో కొందరు యాజమాన్యానికి సంబంధించిన వారు కావడంతో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతేకాకుండా బాధిత యువతిని అన్ని ప్రయోగ పరీక్షల్లోనూ ఫెయిల్ చేశారు. మనస్తాపానికి గురైన బాధితురాలు ఈ నెల 5న ఇంటికి వచ్చి శానిటైజర్ తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. కళాశాల యాజమాన్యం, సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి కోరుతున్నారు. దీనిపై తమకు సమాచారం అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
Suicide: చిత్తూరు జిల్లాలో విషాదం.. వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య
TAGGED:
ap latest news